ఎంఎస్పి జాతీయ నాయకులు మహబూబాద్ జిల్లా ఇన్చార్జి మామిడి వరకు చిన్న సుబ్బారావు
నవతెలంగాణ – నెల్లికుదురు
చేయూత పేన్షన్ దారుల సమావేశం ఈనెల 29వ తేదీన తొర్రూర్ లో జరగబోయే సన్నహాగా సమావేశాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం ఎస్ పి జాతీయ నాయకుడు మహబూబాద్ జిల్లా ఇన్చార్జి మామిడి చిన్నవరకపు చిన్న సుబ్బారావు కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలో చేయూత పెన్షన్ దారుల సమావేశం వీ హెచ్ పిఎస్ మండల అధ్యక్షుడు బండారి సారంగం అధ్యక్షతన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విహెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి పాషా లు పాల్గొని మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్లు రూ.6000కు పెంచాలని మరియు మొత్తం చేయూత పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4000 పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమంలో భాగంగా నెల్లికుదురు మండల కేంద్రంలో చేయూత పెన్షన్ దారులు అందరు తొర్రూరు లో జరగబోయే సన్నాహక సదస్సును విజయవంతం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీ హెచ్ పి ఎస్ నెల్లికుదురు మండల ఇంచార్జి చెడుపాక లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ పోలేపాక ప్రవీణ్ మండల ఇంచార్జి తూళ్ల వెంకన్న, బిహెచ్ పి ఎస్ గౌరవ అధ్యక్షుడు హెచ్ వెంకటేశ్వర్లు,మండల అధికార ప్రతినిధి మర్కా రాము,మద్ది రాజు, సలుగ అశోక్,ఐలయ్య,వెంకన్న,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.