నవతెలంగాణ – ఆలేరు టౌన్
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఇందిరాపార్క్/ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు, నిర్వహించు మహాధర్న జయప్రదం చేయాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి, బొమ్మ కంటి బాలరాజు కడారి రమేష్ లు, ఆలేరు పట్టణంలో మంగళవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.
జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్ సభ్యులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. మార్చి 2024 నుండి రిటైర్ అయిన ( మార్చి 24 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లను ధర్నా విజయవంతం కొరకు కీలకంగా తరలిరావాలని కోరారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ రాక ఎంతోమంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రభుత్వం ,వారికి రావలసిన గ్రాట్యుటీ ,కమ్యుటేషన్ ,సరెండర్ లీవులు ,తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు ఇందిరాపార్కు, హైదరాబాదు వద్ద జరగబోయే మహాధర్నాను జయప్రదం చేయాలని పేర్కొన్నారు.



