– ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ సభ్యులు,కొంగల వెంకట్, యాదగిరి
నవతెలంగాణ – కామారెడ్డి
అక్టోబర్ 11,2025 నా జరిగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాద్యాయ మహా గర్జన సభను విజయ వంతం చేయలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ సభ్యులు, కొంగల వెంకట్, యాదగిరి లు తెలిపారు. తేది 31.08.2025 రోజున ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమావేశం జరిగింది ఈ సమావేశం నకు రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ సభ్యులు కొంగల వెంకట్,యాదగిరి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లో జరుగుతున్న అన్యాయముపై అక్టోబర్ 11,2025 నాడు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయుల మహ గర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ సభకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులు వేలదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ , 2 లోని అడక్క్వసి( Adequacy) పదము పెట్టీ, ఓపెను మెరిట్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ లను రిజర్వేషన్ కోటలో పెట్టడము వలన రియర్వేషన్ లో అర్హత కల్గిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.అదే విధంగా 2024 డీఎస్సీ లో మేనేజ్మెంట్ ఆప్షన్ ఫామ్ పేరిట ఓపెన్ మెరిట్ లో ఉన్న న్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ను రిజర్వేషన్ లో పెట్టడము వలను రిజర్వేషన్ లో అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోయారు.కావున జీవో ఎంఎస్ నెంబర్, 2 లోని Adequacy నీ సవరించి ఓపెన్ మెరిటోలోకి అవకాశము ఇచ్చి జీవో ఎంఎస్ నెంబర్ 5 ను పునరుద్ధరించాలని అన్నారు.ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సంగయ్యా, అల్ ఇండియా బంజారా సేవ సంఘం ప్రధాన కార్యదర్శి మోతి సింగ్, హీర లాల్, సుభాష్, రాజన్న, వంశిక్రిష్ణ, రవి, రామచందర్ నాయక్, బాణోత్ ప్రకాష్, సత్యము తది తరులు పాల్గొన్నారు.