- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి
ఈ నెల 30న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గిరిజన సంఘం జిల్లా ద్వితీయ మహాసభను విజయవంతం చేయాలని మాచారెడ్డి మండల అధ్యక్షుడు లింబియా నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎల్లంపేట తండాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ మహాసభలో గిరిజనుల హక్కులు, అటవీ చట్టం అమలు, బ్యాంకు రుణాల సమస్యలు, ఉపాధి హామీ చట్టంలోని లోటుపాట్లు తదితర ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతామని తెలిపారు. రాబోయే మూడేళ్లకు గిరిజనుల ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజు నాయక్, గన్ను నాయక్, హేమ్లా నాయక్, కిస్టు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



