- Advertisement -
- – ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ -పరకాల : పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే కలెక్టర్ రేట్ మట్టడి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గరికి గడుస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం గర్హనీయమన్నారు. అద్దె భవనంలో ఉంటున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు సంజయ్, సందీప్, విజయ్, అజయ్, సుస్మిత, అక్షర విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -