ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల పిలుపు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల ను వెంటనే అమలు చేయడానికి కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కృషి చేయాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరారు. బిసి రిజర్వేషన్ ల గ్యారంటీ గా అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చాలని, గవర్నర్ కూడా 50 శాతం జనాభా గల బిసి ల జనాభా సమస్య మీద వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బిసి జనాభా లెక్కలను ప్రభుత్వం చేపట్టి, వారి శాతాన్ని తేల్చడం జరిగింది. కాబట్టి పార్లమెంటు లో చట్ట సవరణ చేసి రిజర్వేషన్ ల శాతాన్ని ఆయా వర్గాల జనాభా మేరకు పెంచడానికి బిజెపి పార్టీ చొరవ తీసుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ కూడ చొరవ తీసుకొని వాళ్లు బిసి ల వైపు నిలబడాలి.
అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్త బిసి ల బంద్ ను జోగులాంబ గద్వాల జిల్లాలో జయప్రదం చేయాలని అన్ని బహుజన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బిసి సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిసి సంక్షేమ సంఘం నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, బహుజన రాజ్య సమితి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, మధు సూదన్ బాబు, ఎం. వాల్మీకి, వినోద్ కుమార్, టీపీఎఫ్ ప్రభాకర్, సిపిఐ ఆంజనేయులు, టిఆర్ఎస్వి పల్లయ్య, సిపిఎం వెంకటస్వామి, హన్మి రెడ్డి, కిరణ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ సుభాన్, లాయర్ దామోదర్, టిఆర్ఎస్ గంజి పేట రాజు, రైతు సుంకన్న, టీచర్ బుచ్చన్న, సాధత్, డాక్టర్ ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ సాధనకై రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES