– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలగాణ-కాప్రా
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని కమలానగర్ సీఐటీయూ ఆఫీసులో మేడ్చల్ జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న జరిగే సమ్మెకు ప్రజాసంఘాలన్నీ మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడంతో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. విత్తన చట్టాల్లో మార్పులు, విద్యుత్ చట్టాల్లో మార్పులు, ఎల్‌ఐసీ సంస్థను పూర్తిగా ప్రయివేటుపరం చేయటం ఇలా అన్ని రకాల ప్రభుత్వరంగ వ్యవస్థలపై మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దాడి చేస్తున్నదని వాపోయారు. ఏప్రిల్ ఒకటి నుంచి లేబర్ కోడ్స్ అమలవుతాయని, అవి అమలైతే కార్మికులకు ఎలాంటి హక్కులూ లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్‌ల అమలును అడ్డుకోవాలంటే ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని కేంద్రానికి తమ ప్రతిఘటన తెలియజేయాలన్నారు. సమ్మెకు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా సహాయ కార్యదర్శి ఏ.అశోక్, నాయకులు జి.శ్రీనివాసులు, రాజశేఖర్, గణేష్, లింగస్వామి, ఎన్.శ్రీనివాస్, ఉన్నికృష్ణ, ఎం.వినోద, కార్తీక్, శ్రీనివాస్, నాగలక్ష్మి, చంద్రమోహన్, మహిళా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



