నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 6వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిశంబర్ 29,30 తేదీల్లో జరుగుతాయని మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్ ఎంఎన్. రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల పెన్షనర్ల సంక్షేమం గురించి, హక్కుల గురించి చర్చించే ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని టాప్ర రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పి.నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, ఎం.రంగయ్య, ఎం.నరహరి, ఎం.జనార్ధన్ రెడ్డి, డాక్టర్ ఎల్.అరుణ, ఎన్.సోమయ్య, డాక్టర్ స్వరాజ్ కుమార్, జి.అశోక్ తదితరులు పాల్గొని మహాసభల ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ఈపీఎఫ్, సింగరేణి పెన్షనర్ల సమస్యలపై చర్చించడానికి ఎన్‌సీసీపీఏ, ఎఫ్‌సీపీఏ, సెక్రెటరీ జనరల్ కె.రాఘవేంద్రన్, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. అలాగే ప్రముఖ వైద్యులు అఖిల్ దాడి, మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, టీజీజేఏసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఇ.శ్రీనివాస్ రావు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవితో పాటు ఎం.సంయుక్త, పద్మశ్రీ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.
డిశంబర్ 29,30 తేదీల్లో..టాప్ర మహాసభలు జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



