నవంబర్ 30న చలో కామారెడ్డి
నవతెలంగాణ – గాంధారి
నవంబర్ 30న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ జిల్లాలోని రైతులను కోరారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నవంబర్ 30న చలో కామారెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. రైతుల కోసం వారి యొక్క సమస్యలపై నిరంతరం పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే ఒక్క తెలంగాణ రైతు సంఘం తప్ప మరొకటి కాదని అన్నారు. రైతుల పక్షాన నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
మూడు నల్ల చట్టాల విషయంలో ప్రధానమంత్రి మోడీ గారి మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేయించిన ఘన చరిత్ర ఏఐకేఎస్ రైతు సంఘం కే దక్కుతుందని అన్నారు. అదే కాకుండా భూమి కోసం సాగునీళ్ల కోసం నిరంతరం పోరాటం మండల కేంద్రాలలో పోరాట రూపకల్పన జరుగుతుందని అన్నారు. అందుకనే ఈనెల 30న జరిగే తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభను విజయవంతం చేయడం కోసం రైతులందరూ కలిసి రావాలని అన్నారు. ఆ సభకు ఆర్థిక హార్థిక సాకారాలని అందించి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ గుండా, రైతులు భీమా నాయక్ పరశురాం రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.



