Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలను జయప్రదం చేయండి: సీఐటీయూ

ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలను జయప్రదం చేయండి: సీఐటీయూ

- Advertisement -

నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని రవాణా రంగ కార్మికులు టవర్ మబ్బుల్, ఉప్పేర్ అంజి పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం చేయాలని గురువారం జిల్లా కేంద్రంలో కార్మికులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు.

ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా రెండవ మహాసభలు రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు అల్లంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనున్నాయని తెలిపారు.ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీకాంత్, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి, వివి నరసింహా హాజరుకానున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా డ్రైవర్లకు 12000 ఇస్తామని చెప్పి హామీని నెరవేర్చలేదని విమర్శించారు, రవాణా రంగ కార్మికులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సైతం మోటార్ వెహికల్ యాక్ట్- 2020ని తీసుకొచ్చిందని విమర్శించారు.

రవాణా రంగంలో ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకుంటున్న నేటి తరుణంలో, డ్రైవర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అటువంటి రవాణా రంగ కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని విమర్శించారు. మహాసభలలో రవాణా రంగ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటామని తెలిపారు.కావున జిల్లాలోని ఆటో,ట్రాలీ, జీపు, తుఫాను,లారీ,బస్సు, ట్రాక్టర్, తదితర వాహనాల డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రవాణా రంగ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -