సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి
నవతెలంగాణ – వలిగొండ రూరల్
త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై ఈనెల 27న భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు. గురువారం రోజున వర్కట్ పల్లి గ్రామంలో భూ నిర్వాసితులను కలిసి ధర్నాకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న,సన్న కారు రైతుల భూములను రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో బలవంతంగా లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభం చేకూర్చే విధంగా పేదల భూములు గుంజుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు సెప్టెంబర్ 27న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో కలిపి మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, భూ నిర్వాసితులు సోలిపురం జనార్దన్ రెడ్డి, మాడుగుల యాదగిరి, మెట్టు రవీందర్ రెడ్డి, టేకు సోమశేఖర్, గంగాధరి శేఖర్, మాడుగుల లచ్చయ్య, రామచంద్రయ్య, గోగు కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల మహాధర్నాను జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES