Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి

వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి

- Advertisement -

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజలు ఇండ్లలో  నాటుకునేందుకు పండ్ల మొక్కల్ని అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు.

ఈ నెల చివరనాటికి గుంతలు తవ్విన ప్రదేశాల్లో  మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు,  ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -