Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శిక్షణా తరగతులు జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

శిక్షణా తరగతులు జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : జూన్ ఈనెల 9,10,11 తేదీల్లో  యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు శాఖా కార్యదర్శులు సీనియర్ నాయకులు శిక్షణ క్లాసులకు ప్రతినిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి నరేంద్ర మోడీ ప్రజలపై అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రజలపై అనేక రకాలుగా జిఎస్టి పేరుతో నిరుపేదలపై భారాలు మోపుతూ నిత్యవసర ధరలు పెంచుతుందన్నారు. పేదవాడు ప్రతి కూతురు పెళ్లికి కనీసం తులం బంగారం పెట్టలేని పరిస్థితి బిజెపి ప్రభుత్వంలో దాపరించిందన్నారు. అంబానీ ఆదాని దేశ సంపదను దోచిపెడుతూ రైల్వే, విమానం, పోస్టల్, ఎల్ఐసి, జాతీయ రహదారులు, గ్యాస్, పెట్రోల్, కార్పోరేట్ శక్తులకు విదేశీ పెట్టుబడిదారులకు ధారధక్తం చేస్తున్నదన్నారు. ప్రజలకు ఎలాంటి ఉపాధి చూపించకుండా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని దేశ ప్రజలను మోసం  చేశారన్నారు. ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదన్నారు. బిజెపి మాత్రం వారి పార్టీ ప్రయోజనాల కోసం పార్టీ ఫండ్ పెంచుకుంటూ పోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఇందిరమ్మ ఇండ్లు స్థలం లేని వారికి స్థలం ఇస్తూ రూ.5 లక్షలు మంజూరు చేస్తానని కొంతమందికి ఇచ్చి ఆశలు పెడుతుందన్నారు.  ప్రతి ఇంటికి ఆడపర్చుకు రూ. 2500, కాలేజీ చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తానని ఇంతవరకు అది గతి లేదన్నారు. పై ఆశలు చూపిస్తూ  ప్రజలకు మాత్రం పథకాలు చేరడం లేదన్నారు. ఈ రాజకీయ శిక్షణా తరగతులు పార్టీ టౌన్ మండలం సభ్యులు శాఖ కార్యదర్శులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును క్రింది స్థాయి కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఆయన కోరారు. ప్రజలు ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ నాయకులు వోల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, సుందర్  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img