నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
కోటగల్లి లోని ఎన్ఆర్భవన్లో పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ను విజయవంతం చేయాలని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. గోదావరి, ఏ. సంధ్యారాణి మాట్లాడుతూ.. మార్చి 1 నుండి 8 వరకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగిందన్నారు . ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పేద మహిళలకు చేయూతనిచ్చే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఈ రద్దుకు వ్యతిరేకంగా మహిళల యొక్క ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మహిళల ఉపాధి పై దెబ్బతీస్తే మహిళలు పేద ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తారని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు కోరునారు. ఈ కార్యక్రమంలో పీడబ్యుఓ జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి,కోశాధికారి విపాష,జిల్లా నాయకులు కీర్తన,సునంద,నర్సక్క, రెహానా,ఆశలత తదితరులు పాల్గొన్నారు.



