Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రామిక మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

శ్రామిక మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మహిళల ఉపాధి పై జరుగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల అరుణ,భారతి పిలుపునిచ్చారు. ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ,నిజామాబాద్ లోని నీలం రామచంద్రయ్య భవన్ లో మహిళా దినోత్సవం పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ,భారతి లు మాట్లాడుతూ శ్రామిక మహిళల హక్కులను సాధించిన రోజుకు గుర్తుగా మార్చి 8 నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారని,ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మహిళల ఉపాధిపై పాలకులు దెబ్బకొట్టారని దాన్ని నిరసిస్తూ ఈ మహిళా దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చారు.

 లేబర్ కోడ్ లు తీసుకొచ్చి కార్మిక మహిళల ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని అన్నారు. సహజ వనరులను, అడవులను ధ్వంసం చేసి కార్పొరేట్ లకు అప్ప చెపుతున్నారని,దానికి వ్యతిరేకంగా పోరాడే ఆదివాసీ గిరిజన మహిళలను హత్యలు,అత్యాచారాలు చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని అన్నారు. రక్షణగా ఉన్న కొన్ని చట్టాలనైన సరిగా అమలు చెయ్యటం లేదని,పైగా వాటిని రద్దు చెయ్యజూస్తున్నారని మండి పడ్డారు. అందుకే మహిళలు తమ హక్కుల రక్షణ కోసం తామే పోరాటానికి ముందుకు రావాలని అన్నారు. మహిళా దినోత్సవాన్ని ఈ డిమాండ్ లతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరపాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో  నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మీ, జి.సంజన,జిల్లా నాయకులు మానస తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -