Friday, October 10, 2025
E-PAPER
Homeసినిమాథియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది

థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది

- Advertisement -

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం జంటగా విజయేందర్‌ దర్శకుడిగా రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. బీవీ వర్క్స్‌ బ్యానర్‌ మీద బన్నీ వాస్‌ సమర్పణలో కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా ఈనెల 16న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ నిహారిక ఎన్‌ ఎం గురువారం మీడియాతో షేర్‌ చేసుకున్న విశేషాలు.. నేను తొలుత ‘మిత్ర మండలి’ కథ విన్నప్పటికి, ‘పెరుసు’ తమిళ చిత్రం ముందుగా రిలీజ్‌ అయింది. ఇందులో నేను ఓ సాఫ్ట్‌ పాత్రను పోషించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్‌ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది. ప్రియదర్శి అద్భుతమైన నటుడు.

ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్‌’ చిత్రం పెద్ద హిట్‌ అయింది. ఎంత సక్సెస్‌ వచ్చినా ఆయన ఒదిగి ఉంటారు. నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్‌ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. ఈ చిత్రంలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది. తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. ఇలాంటి బ్యానర్స్‌లో సినిమా చేయటం సంతోషంగాఉంది. టాలీవుడ్‌లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్‌ ఇంకెక్కడా దొరకలేదు.

ఇండిస్టీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండిస్టీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్‌ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.
నిహారిక ఎన్‌ ఎం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -