గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్ : గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) హెచ్చరికలు జారీ చేసింది. ఫారమ్ ఐ-485 నింపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పొరబాటు చేసినా లేదా దానిని సరిగా నింపకపోయినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నదని, ప్రాసెసింగ్‌లో దీర్ఘకాల జాప్యం జరగవచ్చునని తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఫారమ్‌ను నింపేటప్పుడు సూచనలు పాటించాలని యూఎస్‌సీఐఎస్ హితవు పలికింది. కొందరు దరఖాస్తుదారులు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం లేదని, దీనివల్ల దరఖాస్తులను తిరస్కరించవచ్చునని లేదా అసాధారణ జాప్యం జరగవచ్చునని వివరించింది. ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారు గ్రీన్ కార్డు పొందడానికి ఫారమ్ ఐ-485ను నింపాల్సి ఉంటుంది. తాత్కాలిక వీసా లేదా నాన్-ఇమ్మిగ్రెంట్ హోదా నుంచి చట్టబద్ధమైన శాశ్వత నివాసాన్ని పొందడానికి ఇది ఎంతో కీలకం. ఫారమ్ ఐ-485లో వ్యక్తిగత వివరాలు, నేపథ్యం, ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ఫారమ్ నింపడంలో తప్పులు దొర్లడం సహజమేనని నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న పొరబాట్లు జరిగినా లేదా ఏదైనా సమాచారం ఇవ్వకపోయినా దరఖాస్తు ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఒకరు తెలిపారు.
పొరపాటు చేస్తే మూల్యం తప్పదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



