నవతెలంగాణ – కంఠేశ్వర్
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో స్థానిక వర్ని రోడ్ లో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్ విద్యార్థులచే మట్టి గణపతులను తయారు చేయించారు. విద్యార్థులందరూ మట్టి గణపతి తమ ఇంటి వద్ద పూజించాలని ప్రతి ఒక్క విద్యార్థికి మట్టి గణపతిని అందజేశామని రోటరీ క్లబ్ జేమ్స్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు. పర్యావరణం పరిరక్షించాలంటే మట్టి గణపతులను వాడాలని తెలిపారు. విద్యార్థి దశ నుండే మట్టి గణపతులను తయారు చేయడం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మట్టి గణపతుల సంస్కృతి అలవాటు పడుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర కెమికల్స్ రంగులు వాడిన గణపతి ప్రతిమలను వాడొద్దని సూచించారు.
గణపతుల ప్రతిష్టాపన రోడ్లపై పెట్టకూడదని అతి భారీ గణపతి విగ్రహాలను తేవడం వలన కరెంటు వైర్లు డిష్ వైర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని మొన్ననే హైదరాబాదులో ప్రమాదం జరిగి 6 మంది మృతి చెందారని తెలిపారు. జిల్లా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయాలని సూచించారు. నిజామాబాద్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ కార్యవర్గం సభ్యులు సెయింట్ జేవియర్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.
రోటరీ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులచే మట్టి వినాయకుల తయారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES