హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవు తున్నారు. ఇది ఆయన హీరోగా రాబోతున్న 35వ ప్రాజెక్ట్.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా దీన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబం ధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు.
వినాయక చవితి పండగ నేపథ్యంలో ఈచిత్రం నుంచి ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే, విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి నిర్మాత: ఆర్‌బి చౌదరి, దర్శకుడు: రవి అరసు, సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్, కళా దర్శకుడు: జి.దురైరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్.
మాఫియా నేపథ్యంలో ‘మకుటం’
- Advertisement -
- Advertisement -