- Advertisement -
హైదరాబాద్ : సామాజిక బాధ్యత పట్ల తమ నిరంతర నిబద్ధతలో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని మలబార్ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘నర్చరింగ్ బిగినింగ్స్’ అనే కొత్త సిఎస్‌ఆర్ చొరవను ప్రారంభించినట్లు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల తల్లులు, పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు, వారి శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి, పిల్లల మానసిక మరియు మేధో వికాసానికి మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ మద్దతును ఇవ్వనుందని మలబార్ గ్రూప్ చైర్మెన్ ఎంపీ అహమ్మద్ తెలిపారు. ఈ ఒప్పందంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ పాల్గొన్నారు.
- Advertisement -