Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంమాల్దీవులు అధికారులకుఅంతర్గత ఆడిట్‌పై ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో శిక్షణ

మాల్దీవులు అధికారులకుఅంతర్గత ఆడిట్‌పై ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో శిక్షణ

- Advertisement -

– స్థానిక పరిపాలనా కేంద్రాల్లో సందర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఆధ్వర్యంలో భారత విదేశాంగ శాఖ సహకారంతో అంతర్గత ఆడిట్‌పై రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్దీవులు దేశానికి చెందిన 30 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన ఈ శిక్షణ 16 రోజుల పాటు అనగా జూన్‌ రెండో తేదీ వరకు కొనసాగనున్నది. స్థానిక సంస్థల ఖాతాలు, ఆడిట్‌ రంగంలో అపార అనుభవం ఉన్న సీనియర్‌ రిసోర్స్‌ పర్సన్‌, భారత కంప్ట్రోలర్‌ జనరల్‌, ఆడిట్‌, అకౌంట్స్‌ విభాగంలో పనిచేసిన అనుభవజ్ఞులతో క్లాసులు చెప్పిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఆడిటింగ్‌పై అవగాహన కల్పించనున్నారు.
మన దేశంలో గ్రామీణ ప్రజల జీవనోపాధిని పెంపొందించడానికి అమలు చేస్తున్న పథకాల డిజిటలైజేషన్‌ గురించి వివరించనున్నారు. జిల్లా పరిషత్‌, మండల పంచాయతీ, గ్రామ పంచాయతీ స్థాయిలలో జరిగే అంతర్గత ఆడిట్‌ విధానాన్ని నేరుగా వారు సందర్శించి వీక్షించనున్నారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై తెలుసుకోనున్నారు. అట్లాగే, మాల్దీవులు అధికారులు హైదరాబాద్‌లోని గోల్కొండ, ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, తదితర సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -