- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం పాలక మండలిని నియామకం చేస్తూ దేవాదాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మల్హర్ రావు మండలానికి పాలక మండలిలో ఈసారి కోత పెట్టారు. ఆనవాయితీగా పాలక మండలిలో మండలానికి ఒక డైరెక్టర్ పదవి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం పాలక మండలి పాలకవర్గంలో చోటు దక్కలేదు.పాలకవర్గాన్ని కుదింపు చేయడంతోనే పదవి ఇవ్వలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా 14 మంది సభ్యులతో ఏడాది వరకు పదవీకాలం ఏర్పాటు చేసేవారు.ఈసారి 12 మంది సభ్యులతో మాత్రమే ఏర్పాటు కాకుండా పదవీకాలం రెండేళ్లకు పెంచారు.
- Advertisement -



