ఘనంగా జయంతి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ ఎంపీపీ, మావోయిస్టుల చేతిలో హతమైన స్వర్గీయ బెల్లంకొండ మలహార్ రావు మండలానికి చేసిన సేవలు చిరస్మరనియమని మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కొయ్యుర్ సెంటర్ లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాలతో మాజీ జెడ్పిటిసి గొనె మంగళవారం మల్హర్ రావు 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్హర్ రావు ఎంపీపీగా మండలానికి రవాణ సౌకర్యం, విద్యుత్, కాళి నడకతో తిరిగి చెసిన అభివృద్ధి, సేవలు గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మల్హర్ రావు బంధువులు, మిత్రులు హాజరై మల్హర్ రావు విగ్రహానికి ఘన నివాలర్పించారు.
మల్హర్ రావు చిరస్మరనీయుడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES