నవతెలంగాణ – రాయపోల్
మల్లన్న గుట్టలో జరగనున్న మహా శివరాత్రి పండగను పురస్కరించుకొని గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని మంతూర్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ పర్వేజ్, ఉప సర్పంచ్ బందారం సంతోష్ అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో ఆలయ కమిటీ ఎన్నుకొని అనంతరం సభ్యులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ మల్లన్న ఆలయ కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది.నూతన ఆలయ కమిటీ చైర్మన్ దయ్యాల మహిపాల్,వైస్ చైర్మన్ దండు కనక చంద్రం,కోశాధికారి కర్ల కరుణాకర్ రెడ్డి,కార్యదర్శి తంగేలపల్లి నర్సింలు,కమిటీ సభ్యులు ఓలపు సుక్కయ్య,వరద సంతోష్,ఎస్‌కే పాషా,బంధారం దశరథం,ఎం.డి. హమ్మద్,జోడు కరుణాకర్,దండు స్వామి,పడిగే రవీందర్,అంబాల నాగరాజు,తాళ్ల గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్లన్న గుట్ట మహా శివరాత్రి పండగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని నూతన కమిటీకి సూచించారు. గ్రామస్తులందరూ సహకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



