Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ను కలిసిన మల్లారం సర్పంచ్ రాజయ్య

కలెక్టర్ ను కలిసిన మల్లారం సర్పంచ్ రాజయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు,మాజీ సర్పంచ్ రాజు నాయక్ బుధవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక బోరు ఏర్పాటు చేయాలని, రావులపల్లి గ్రామంలో నల్లాల ద్వారా నీరు సక్రమంగా అందించేందుకు ఒక మోటారు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ వినతిపత్రాన్ని స్వీకరించారు. త్వరలోనే మంజూరైయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సర్పంచ్ శాలువాతో కలెక్టర్ ను సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -