నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాంలో సరైన భదత్రా కల్పించకపోవడంవల్లే 26మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దాడి అనంతరం పర్యాటకులు జమ్మూకు వెళ్లుతున్నారని, కానీ ప్రధాని మోడీ శ్రీనగర్ వెళ్లడానికి దైర్యంలేదని ఎద్దేవా చేశారు. మోడీ వెళ్తే కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తారని, అందుకే ప్రధాని భయపడుతున్నారని విమర్శించారు. నిఘా వర్గాల నుంచి ముందస్తుగా దాడి గురించి హెచ్చరికలు వచ్చినా..మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, లేకుండా 26మంది ఈరోజు ప్రాణాలతో ఉండేవారని ఖర్గే ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాల కోసం తాము కేంద్ర నిర్ణయానికి మద్దతుగా నిలిచినా..బలహీనమైన పాక్‌కు గుణపాఠం చెప్పలేదని మండిపడ్డారు.
జమ్మూ వెళ్లడానికి మోడీకి ధైర్యంలేదు: మల్లిఖార్జున ఖర్గే
- Advertisement -
- Advertisement -