– ఆయనతో పాటు 60 మంది లొంగుబాటు
– వేణుగోపాల్‌రావుపై రూ.కోటి రివార్డు
నవతెలంగాణ-చర్ల/ మహదేవపూర్
మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్‌రావు అలియాస్ సోను దాదా అలియాస్ భూపతి 60 మంది మావో యిస్టు సహచరులతో మహారాష్ట్ర గడ్చి రోలి పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. అంతేకాక ఆయన పోలీసులకు 50 ఆయుధాలను కూడా అప్పగించాడు. జగ్దల్‌పూర్, గడ్చిరోలి నుంచి వచ్చిన వార్తల ప్రకారం.. మావో యిస్టు సంస్థ అతిపెద్ద దెబ్బను చవిచూసిందని పలువురు విశ్లేషిస్తు న్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన మల్లో జుల వేణుగోపాల్‌రావు 11 రోజుల కిందట.. మావోయిస్టు పార్టీ గతి తప్పిం దని, ఆత్మ సమర్పణ సరైన నిర్ణయమని, 22 పేజీల లేఖను విడుదల చేశారు. లొంగిపోయిన వివిధ కేడర్లలో గల మిలీషియా సభ్యులతోపాటు, కోర్ కమిటీ సభ్యులతో ఉన్న మావోయిస్టుల తలపై భారీగా రివార్డులు ఉండటంతోపాటు మల్లోజులపై రూ.కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజుల కిందట ఆయన ప్రభుత్వానికి లొంగిపోవాలనే కోరికను వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం. ఇది మావోయిస్టు సంస్థలో అంతర్గత విభేదాలు, విభజనలకు దారితీసింది. ఇప్పటివరకు మావోయి స్టులు ఎక్కడ లొంగిపోయినా కేవలం వ్యక్తిగా లొంగిపోయేవారు కానీ ఆయుధాలను అప్పగించడం ఇదే తొలిసారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టు లందరినీ పోలీసులు విచారిస్తున్నారు. మల్లోజుల తన తండ్రి చనిపోయి నప్పుడు కూడా స్వగ్రామం పెద్దపల్లికి రాకుండా తల్లికి ఒక లేఖ రాసి ”నేను నా జీవితం మొత్తం మావోయిస్టు పార్టీకి అంకితం” అని పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మావోయిస్టు పార్టీలో కలకలంతోపాటు అలజడి నెలకొంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్‌జీ) విప్లవ స్ఫూర్తినే వేణు గోపాల్ ఆదర్శంగా తీసుకుని మావో యిస్టు పార్టీలో చేరి అత్యంత కీలకంగా వ్యవహరించారు. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మల్లో జుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మృతిచెందారు. తదనంతర పరి ణామాల నేపథ్యంలో మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా కూడా లొంగిపోయారు.
మల్లోజుల సరెండర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES