- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని మల్లూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనుప్రియ,మధుకర్ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపిక అయినట్టు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో జరుగుతున్న 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి ఖో ఖో ఛాంపియన్ షిప్ లో నిజామాబాద్ జిల్లా నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని ఆయన అన్నారు.మండల విద్య శాఖ అధికారి తిరుపతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు,యువకులు విద్యార్థులకు అభినందించారు.
- Advertisement -



