Wednesday, November 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఒపీనియన్‌ పోల్స్‌లో మమ్దానీ ముందంజ

ఒపీనియన్‌ పోల్స్‌లో మమ్దానీ ముందంజ

- Advertisement -

న్యూయార్క్‌ : న్యూయార్క్‌ మేయర్‌ పదవికి జరిగిన పోలింగ్‌ మంగళవారం ముగిసింది. ఒపీనియన్‌ పోల్‌లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి మాందానీకి స్పష్టమైన ఆధిక్యత కన్పించింది. దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివాను కాదని డెమొక్రటిక్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికలలో మాందానీ చేతిలో ఓటమి పాలై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అండ్రూ క్యూమోకు మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ న్యూయార్క్‌ వాసులు మాందానీ వైపే మొగ్గు చూపారని ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా దేశంలో ఓ ప్రధాన ఎన్నిక జరిగింది. ఆయన నాయకత్వ విధానాలపై న్యూయార్క్‌ ప్రజలు విస్తృతంగా చర్చించుకున్నారు.

కమ్యూనిస్టులపై ట్రంప్‌ అక్కసు
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అది మాందానీకి వేసినట్లే అవుతుందని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో వ్యాఖ్యానించారు. ‘వ్యక్తిగతంగా క్యూమోను ఇష్టపడినా, పడకపోయినా మీకు మరో దారి లేదు. ఆయనకు ఓటు వేయాల్సిందే’ అని ప్రజలకు సూచించారు. కాగా ట్రంప్‌ విధానాలు, గ్రామీణ ఆస్పత్రులను, లక్షలాది ప్రజల ఆరోగ్య బీమా కవరేజీని ఏ మాత్రం పట్టించుకోని ఆయన ‘అద్భుత’ బడ్జెట్‌, ఇటీవలి ప్రభుత్వ షట్‌డౌన్‌ వంటి అంశాలు న్యూయార్క్‌ ఎన్నికపై ప్రభావం చూపాయని పరిశీలకుల అంచనా. కమ్యూనిస్టు అభ్యర్థి మాందానీ విజయం సాధిస్తే న్యూయార్క్‌కు ప్రభుత్వం అందజేస్తున్న నిధులలో కోత విధిస్తానని ట్రంప్‌ బెదిరించారు. ‘కమ్యూనిస్టును గెలిపిస్తే ఈ గొప్ప నగరానికి భవిష్యత్తు ఉండదు. కనీసం అది మనుగడ కూడా సాగించలేదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. కమ్యూనిస్టు అధికారంలో ఉంటే న్యూయార్క్‌ మరింత అధ్వాన్నంగా మారిపోతుందని, నగరంలో ఆర్థిక- సామాజిక విపత్తు సంభవిస్తుందని శాపనార్థాలు పెట్టారు. దీనిపై మాందానీ ఘాటుగానే స్పందిం చారు. తమ ప్రచారం చూసి ట్రంప్‌ భయపడ్డారని ఆయన వ్యాఖ్యానిం చారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరచిన బిలియనీర్లే తమ పార్టీ ప్రైమరీ రేసులో క్యూమోకు నిధులు సమకూర్చిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.

ముందస్తు పోలింగ్‌లో భారీ ఓటింగ్‌
ముందస్తు పోలింగ్‌లో భారీగా ఓట్లు నమోదు కావడం మాందానీ విజయా వకాశాలను మరింత మెరుగుపరచింది. గత తొమ్మిది రోజులుగా న్యూయార్క్‌ నగర ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 7,35,000కు పైగా ఓట్లు నమోదయ్యాయని ఫాక్స్‌ న్యూస్‌ తెలిపింది. ఒక్క ఆదివారం నాడే 1,51,212 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని న్యూయార్క్‌ నగర ఎన్నికల బోర్డు చెప్పింది. నగర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఓటింగ్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. 2021లో జరిగిన ముందస్తు పోలింగ్‌లో పోలైన ఓట్లతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అదనం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -