- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలో చిట్టిల పేరుతో మోసం చేసిన వ్యక్తి ని అరెస్టు చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎడ్ల రాజు అనే యువకుడు చిట్టిల పేరుతో దాదాపు 15 లక్షల రూపాయలు కట్టించుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -