నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామ శివారు కౌలాస్ నాళా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ మండలం పెంట గ్రామానికి చెందిన వెంకట్ (25-30) అత్తగారిల్లైన వజ్ర ఖండికి భార్యతో కలిసి ఐదారు రోజుల క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మద్యం సేవించాడు. నువ్విలా మద్యం మానయకపోతే నేను ఇంటికి రానని భార్య ఆగ్రహించింది. దీంతో మనస్థాపానికి గురై, శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని కౌలాస్ నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహం గుర్తుపట్టకుండా శరీరమంతా ఉబ్బిపోయింది. అత్తమామలు కూడా సంఘటన స్థలానికి వచ్చి గుర్తుపట్టలేక తిరిగి వెళ్లిపోయినట్టు సమాచారం. చివరికి మృతుడి తల్లిదండ్రులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అదేవిధంగా స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
కౌలాస్ నాళా ప్రాజెక్టులో పడి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



