నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన జానపాటి కోటేష్ (33)కు 2015 సంవత్సరంలో నిడమనూరు మండలం కుంటి గొర్లగూడెం గ్రామానికి చెందిన హేమలత ఆమెతో వివాహమైనది. వారికి ఇద్దరు అమ్మాయిలు కారుణ్య (10), తనుశ్రీ,(8) ఉన్నారు. పెళ్లి అయిన కొంతకాలం తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవలు రావడంతో గత ఆరు నెలల నుండి కోటేష్ భార్య హేమలత తన పిల్లలతో సహా తల్లి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది.
గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో సదరు కోటేష్ తన ఇంటిలో గొంతుపై తీవ్రమైన రక్త గాయంతో పడి మరణించి ఉండడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, మృతుని భార్య జానపాటి హేమలతకు సమాచారం తెలియపరిచారు. తన భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న హేమలత, వారి కుటుంబ సభ్యులతో పెద్ద గూడెం వచ్చారు. అనంతరం శవాన్ని నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ తరలించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసు విచారణ లో భాగంగా నల్గొండ నుండి క్లూస్ టీం, డాగ్ స్క్వార్డ్ ను పిలిపించి నేరస్థలంలో గల చాకును స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



