నవతెలంగాణ – కంఠేశ్వర్: నగర శివారులోని మాధవ్ నగర్ దగ్గర గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మే 31 తేదీ సాయంత్రం 07:00 గంటల సమయంలో నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ అయిన హరి కృష్ణ ఇచ్చిన సమాచారం ప్రకారం.. నిజామాబాదు డిచిపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో మాధవ్ నగర్ దగ్గర కె ఏం నెంబర్ 465 వద్ద ఒక గుర్తు తెలియని 45 సంIIలు గల పురుషుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఉదేశ్యంతో రైలు పట్టలపై పడుకున్నాడు. ట్రైన్ నెంబర్ 17058 సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్ళే రైలు అతనిపై వెళ్లడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి నంబర్కు 8712658591 సమాచారం అందించాలన్నారు.
రైలు పట్టాలపై పడి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -



