Thursday, October 2, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య 

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ – రామడుగు 
అప్పులు ఎక్కువై తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోతె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిప వివరాల ప్రకారం .. మండలంలోని మోతె గ్రామానికి చెందిన బత్తిని తిరుపతి 42 గత ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. తీవ్రంగా నష్టపోయి, అప్పులు చేసాడు. కాగా తిరుపతి గత ఆరు నెలల నుండి కరీంనగర్ లో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు ఎలా తీర్చాలని ఎప్పుడూ మదనపడుతూ.. తరచు బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో తిరుపతి  తన స్వగ్రామమైన మోతెలోని తన ఇంటిలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -