- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రానికి చెందిన జడల బక్కయ్య (70) అనే వ్యక్తి గురువారం ఇంట్లొ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జడల బక్కయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బాధితుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -