నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఓ గుర్తు తెలియని వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ చెరువులో ఒక మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అతడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం ముఖేష్(34)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఎవరూ అతన్ని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హిమాయత్‌సాగర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -