అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..

నవతెలంగాణ – భీంగల్
బెంగాల్ పట్టణ కేంద్రం చెందిన మేడం నరేష్(50)  అనే వ్యక్తి అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ హరిబాబు అందించిన వివరాల ప్రకారం.. బీడీ ప్యాకర్ గా పనిచేస్తున్న నరేష్ కు  అప్పులు ఎక్కువ కావడంతో  అవి ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెంది, ఈనెల 12న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి కస్తూర్బా పరిసరాలలో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, ఘటన స్థలానికి చేరుకొని  పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం  ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించినట్లు తెలిపారు.  మృతునికి  భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love