Friday, November 7, 2025
E-PAPER
Homeఖమ్మంఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య 

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మద్యానికి బానిస కావడంతో పాటు,ఆర్ధిక ఇబ్బందులు తోడవడంతో మొలలు నివారణకు సాంప్రదాయ వైద్యం చేసే సర్కార్ న్యూటన్ కుమార్(40) శుక్రవారం తన క్లినిక్ లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య రీనా చేసిన రాతపూర్వక పిర్యాదు పై విచారణ చేపట్టిన శిక్షణా ఎస్ఐ కే.అఖిల తెలిపిన కధనం ప్రకారం పశ్చిమ బెంగాల్ కు చెందిన న్యూటన్ కుమార్ కొన్నేళ్ళుగా అశ్వారావుపేట పరిధిలోని పాత ఆంధ్రా బ్యాంక్ వీధిలో మొలలు నివారణకు కు సాంప్రదాయ వైద్యం చేస్తూ స్థిరపడ్డాడు. న్యూటన్ కుమార్ కు అతి మద్యపానం,పొగ పీల్చడానికి బానిసయ్యాడు.దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.శవ పంచనామా అనంతరం భౌతికకాయాన్ని భార్య రీనా కు అప్పగించారు.వీరికి పాపం, బాబు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -