Thursday, May 8, 2025
Homeకరీంనగర్ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య..

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -

ముగ్గురు పిల్లలతో కన్నీటి పర్యంతమైన భార్య..
నిరుపేద కుటుంబంలో విషాదం..  
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్నలే.. నాన్న అన్న మూగ సైగలు  అక్కడ ఉన్న వారిని సైతం కలచివేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల్లి కెసిఆర్ నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. వరంగల్ కు చెందిన తాడూరి రామ్ కుమార్ (38) 14 సంవత్సరాల క్రితం వేములవాడ పట్టణానికి చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి పెద్దలకు దూరంగా ఉంటూ సిరిసిల్లలో జిరాక్స్ మెషిన్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. తన తమ్మునితో వివాహ ఈవెంట్లను చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడని భార్య తెలిపింది. ఈ తరుణంలో ముగ్గురు కొడుకులు సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహన్ (1) పుట్టారని, ఆ సమయంలో వైద్య ఖర్చులకోసం కాస్త అప్పు అయిందని ఆమె తెలిపింది. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా నేను కొంతకాలం పని చేశానని, కరోనా రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తయని ఆమె తెలిపింది. చేసిన రూ.3 లక్షల అప్పు తీర్చేది ఎలా.. ఎంత పని చేసినా డబ్బులు రావడం లేదని, ఇలాగైతే అప్పులు ఎలా తీర్చేది అంటూ మనస్థాపానికి గురయ్యేవాడని భార్య తెలిపింది. గత రెండు రోజుల క్రితం వివాహ ఈవెంట్ కోసం వరంగల్ కు వెళ్తున్న అని చెప్పి, తిరిగి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడని ఆమె తెలిపింది. మధ్యాహ్నం సమయంలో పెద్ద కొడుకు  సుఖజీతో బట్టలు సర్దుకో నాని మనం ఊరికి వెళ్దాం అంటూ చెబుతూ… ఇద్దరి తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పినట్లు పెద్ద కొడుకు తెలిపాడు. ఇంతలో గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడని, కాసేపటి తర్వాత ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో పక్కింటి వారి సహాయంతో డోర్ ను పగలగొట్టి చూస్తే.. తన భర్త విగత జీవిగా ఉరివేసుకొని కనిపించాడని భార్య అనిత రోధిస్తూ తెలిపింది. అభం శుభం తెలియని చిన్న కుమారుడు విహాన్ తన తండ్రి చనిపోయాడు అన్న విషయం కూడా తెలియని ఆ పసిబాబు తండ్రిని తట్టి లేపుతున్న సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి ఇన్చార్జి ఎస్సై వినీత రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -