నవతెలంగాణ- రాయపోల్
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బేగంపేట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. గత కొద్ది రోజుల నుంచి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న తగాదాలకు మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు తన ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతుడు కుమ్మరి స్వామి భార్య కుమ్మరి రేణుక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES