నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో గల వరద కాలువలో ప్రమాదవశత్తు పడి మంగళవారం మండల కేంద్రానికి చెందిన కొమిరే రాజేందర్(47) మృతి చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.బట్టలకు బురద అంటుకోవడంతో కడుక్కోవడానికి రాజేందర్ నాగాపూర్ గ్రామానికి వెళ్ళు రోడ్డులో గల వరద కాలువలోకి దిగాడు. బురద కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి వరద కాలువలో పడి మునిగి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి, శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం కొరకు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహంను తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ప్రమాదవశత్తు వరద కాలువలో పడి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES