Saturday, November 15, 2025
E-PAPER
Homeక్రైమ్ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి 

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ – కొండపాక : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాజీవ్ రహదారి కుకునూరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంగలి నాగరాజు(28) రోజు మాదిరిగా ఇంటి నుండి తన షాపు వద్దకు బయలుదేరాడు. గ్రామంలోని కమాన్ వద్ద తన ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతుండగా సిద్దిపేట వైపు నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 36 టి 74 11 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడడంతో పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని అంబులెన్స్ లో గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -