Tuesday, September 16, 2025
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన ఆయిల్ జంగయ్య (65) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.  కుప్పగండ్ల గ్రామం నుండి పెద్దాపూర్ మీదుగా వెల్దండకు తన టీవీఎస్ లూనా వాహనంపై వస్తుండగా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుండి కల్వకుర్తి వైపుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో జంగయ్య తీవ్ర గాయాలయి స్పృహ కోల్పోయాడు. ఈ క్రమంలో జంగయ్యను ఆస్పత్రికి తరలిద్దామని పోలీసులు స్థానికులు ప్రయత్నించగా.. జంగయ్య అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -