Saturday, May 10, 2025
Homeక్రైమ్పిడుగుపాటుకు వ్యక్తి మృతి..

పిడుగుపాటుకు వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: మండలంలో శుక్రవారం సంభవించిన అకాల వర్షానికి పిడుగుపాటు గురై ఒకరు మృతి చెందారు. తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ఆదేశానుసారం ఆర్ఐ క్రిష్ణ సంఘటనా ప్రదేశానికి వెళ్ళి విచారించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని గుమ్మడి వల్లికి చెందిన సాధనం రాజారావు(45) పెద్దవాగు కాలువ పక్కన తనకు గల బెండ తోటలోకి వెళ్ళాడు. సుమారు గంట సమయం సంభవించిన వర్షంలో పొలం పక్కనే ఉన్న చెట్టు క్రింద సేదతీరాడు. ఈ క్రమంలో పిడుగు చెట్టుపై పడటంతో దాని ఘాతుకానికి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -