- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన మంతోల సుభాష్ (35) మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలిస్తుండగా గమనించిన పోలీస్ సిబ్బంది అతనిని పోలీస్ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది పరిశీలించి మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ లో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స కోసం నిజాంబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మరణించినట్లు ఎస్పైస అరుణ్ కుమార్ తెలిపారు.
- Advertisement -