Sunday, September 28, 2025
E-PAPER
Homeక్రైమ్బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి 

బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై చీర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఆరేంద్ర సత్యనారాయణ తండ్రి వెంకటయ్య(66) వడ్రంగి, గ్రామం కోమటిపల్లి, తన బంధువు యొక్క సంవత్సరిక కార్యక్రమమునకు దాట్ల గ్రామంకి వెళ్లి తిరిగి వస్తుండగా.. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ శివారు వచ్చేసరికి, మృతుడు తన బైక్ ను అతీవేగంగా, అజాగ్రత్తగా  నడపడం వలన బైక్ అదుపు తప్పి కిందపడ్డాడని తెలిపారు. దీంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్సులో చికిత్స నిమ్మితం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్సై తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -