Thursday, May 15, 2025
Homeక్రైమ్బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి..

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : పడంపల్లి గ్రామ శివారు గండి ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు దిగుడు వద్ద మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో ఉన్న రాయికి బలంగా వ్యక్తి తల తగిలి  మరణించిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ గ్రామం సంగమేశ్వర కాలనీకి చెందిన పి . రాములు మంగళవారం మహారాష్ట్రలోని మష్ణ ఈరన్న దేవుడి వద్ద ఉన్న దావత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దావత్ అనంతరం తిరుగు ప్రయాణంలో సుమారుగా రాత్రి 8 నుండి 9 గంటల ప్రాంతంలో మద్యం తాగి ఉన్న వ్యక్తి రాములు ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చి పడంపల్లి గ్రామ శివారులోని గండి దిగుడు ఆర్ అండ్ బి రోడ్డు వద్ద పక్కన ఉన్న గుంతలో అదుపుతప్పి గుంతలో పడ్డాడు. దీంతో అక్కడ ఉన్న రాయి బలంగా తలకు తగలడంతో రాత్రి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రాత్రి చిమ్మ చీకటి సమయం కావడంతో మరణించిన వ్యక్తికి ఎవరు చూడకపోవడంతో ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతులు చూసి పడంపల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు . గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరి గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు . అనంతరం మృతుడి పేరు పి.రాములు తండ్రి పేరు భూమయ్య వయస్సు సుమారుగా (55) సంవత్సరాలు ఉంటాయని  తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -