- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో తన అన్న బాత్రూంలో కాలుజారి పడి మృతి చెందినట్లు తమ్ముడు ఎండి రావుఫూ ఖాన్ సన్నాఫ్ హుస్సేన్ ఖాన్ ఫిర్యాదు చేశాడని పట్టణ సిఐ నరారి తెలిపారు. తన అన్న ఎండి ముల్తాజ్ ఖాన్ సన్నాఫ్ హుస్సేన్ ఖాన్ (53) ఆర్ వో టీచర్స్ కాలనీ లో ఉంటున్నాడని, వాష్ రూమ్ కొరకు వెళ్లి కాలుజారి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడగా తలకు గాయం అయిందని తెలిపారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళామని తెలిపారు. తరువాతం డిసెంబర్ 30న మెరుగైన చికిత్స కొరకు వైద్యులు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారని అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8:30కు మృతి చెందాడని వెల్లడించారు.
- Advertisement -



