- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని అజ్జలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అజ్జలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ (38) యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. శనివారం ఉదయం ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు ఇంటి పై నుండి ఉన్న విద్యుత్ తీగలు తగిలి వెంకటేష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ గౌడ్ మృతి చెందాడని సాగర్ హైవేపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంకటేష్ గౌడ్ మృతి పట్ల అజ్జాలపురం గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.
- Advertisement -



