Saturday, May 10, 2025
Homeక్రైమ్మద్యానికి బానిసై.. వ్యక్తి మృతి

మద్యానికి బానిసై.. వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన న్యాత మల్లేశం(50) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల తహాసీల్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంటుగా పని చేస్తున్నాడు.గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు.గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఇంటి అవరణం ముందు పడిపోగా భార్య ఇంట్లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది.అర్థరాత్రి సమయంలో దాహం వేస్తుందనడంతో త్రాగు నీరు తీసుకువెళ్లగా మలమూత్ర విసర్జనాలు చేసుకున్నాడు.పిలిచిన పలుకకపోవడంతో 108 అంబులెన్స్ యందు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి మృతి చెందాడని తెలిపారు.మృతుని భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -